T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన పుంజుకుని బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే వరుణుడు ఎంతమేర సహకరిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. బంగ్లాదేశ్ జట్టుపై టీ20ల్లో టీమిండియాకు మంచి రికార్డే ఉన్నప్పటికీ.. 2016 టీ20 ప్రపంచకప్‌లో […]
What’s Today: * తెలంగాణలో 8వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర.. నేడు బాలానగర్ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా సాగనున్న యాత్ర * బాపట్ల జిల్లా: నేడు కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున * నేడు నెల్లూరు జెడ్పీ సమావేశం.. హాజరుకానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి * […]
T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మంగళవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. గుర్బాజ్ 28, ఘని 27, ఇబ్రహీం 22 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీయగా లహిరు కుమార 2 […]
Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన […]
Unstoppable 2 Promo: ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మూడో వారం కూడా యువహీరోలే సందడి చేయబోతున్నారు. తొలి ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు, లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా రెండో ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ బాలయ్యతో ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లో కూడా ఇద్దరు యువహీరోలు కనిపించనున్నారు. వాళ్లేవరో కాదు.. శర్వానంద్, అడివి శేష్. ఈ ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్ […]
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ల కంటే నామినేషన్ ఎపిసోడ్లే కొంచెం బాగుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా.. నామినేషన్‌లలో 10 మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు […]
Shakib Al Hasan: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ప్రపంచకప్ గెలిచేందుకు రాలేదని, ఇండియాను ఓడించేందుకే వచ్చామని షకీబ్ చెప్పాడు. భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడకు వచ్చిందని.. కానీ తాము ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడికి రాలేదని తెలిపాడు. తాము టీమిండియాను ఓడిస్తే ఆ జట్టు కలత చెందుతుందని తమకు తెలుసు అని.. […]
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్ఎస్ ట్యాంక్ ఎగిరిపడింది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్యాన్నదానం నిర్వహించే చోట ఈ ప్రమాదం జరిగింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవస్థానం […]
Rayalaseema JAC: మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ చేపట్టిన ఉద్యమం క్రమంగా ఉధృతం అవుతోంది. ఇటీవల విశాఖలో ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన నిర్వహించగా.. తాజాగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ జేఏసీ భారీగా మిలియన్ మార్చ్ చేపట్టింది. ఈ మేరకు రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టగా.. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు, మేధావులు […]
Funny Video: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మహిళలు సినిమాల కంటే సీరియల్స్ చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ కొందరు సీరియల్స్‌ను అస్సలు చూడరు. ఇటీవల సీరియళ్లలో గ్రాఫిక్స్ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఓ హిందీ సీరియల్‌లోని ఒక సన్నివేశం నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సీన్‌లో హీరో, హీరోయిన్, విలన్ పతంగులు ఎగురవేస్తారు. హీరో బిల్డింగ్ పైనుంచి పడటంతో హీరోయిన్ కూడా దూకి హీరోను పట్టుకుని గాలిపటానికి ఉండే కట్టె పుళ్లలను పట్టుకుంటారు. ఈ […]