Shakib Al Hasan: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ప్రపంచకప్ గెలిచేందుకు రాలేదని, ఇండియాను ఓడించేందుకే వచ్చామని షకీబ్ చెప్పాడు. భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడకు వచ్చిందని.. కానీ తాము ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడికి రాలేదని తెలిపాడు. తాము టీమిండియాను ఓడిస్తే ఆ జట్టు కలత చెందుతుందని తమకు తెలుసు అని.. అదే తమ లక్ష్యమని షకీబ్ పేర్కొన్నాడు.
Read Also: Secunderabad Crime: ప్రాణం తీసిన మొబైల్.. స్కూల్‌కు ఫోన్ తెచ్చిన విద్యార్థిని
ఈ ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమైనదే అని.. ఏ ఒక్కరిపై దృష్టి పెట్టాలని తాము కోరుకోవడం లేదని షకీబ్ అన్నాడు. తాము ప్రణాళికలకు తగ్గట్లు ఆడితే ఎలాంటి జట్టుపై అయినా విజయం సాధిస్తామని చెప్పాడు. తమ ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ గురించి ఎలాంటి చింత లేదని.. అన్ని విభాగాల్లో జట్టు మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి సారించామని షకీబ్ తెలిపాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్‌పై నూటికి నూరుశాతం ప్రదర్శన చేయాలని భావిస్తున్నామని.. ఇప్పటికే మెగా టోర్నీలో ఐర్లాండ్, జింబాబ్వేలు ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించాయని గుర్తుచేశాడు. తాము కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే అంతకంటే సంతోషం వేరే ఉండదన్నాడు. కాగా గ్రూప్ 2లో ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ చెరో 4 పాయింట్లు కలిగి ఉన్నాయి. బుధవారం నాటి మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తే వాళ్లు సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి.