T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని జట్టు ఆప్ఘనిస్తాన్ మాత్రమే. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నా అవి వరుణుడి కారణంగా వచ్చాయి. అయితే తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ గెలిచినంత పని చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు తుదికంటా పోరాడింది. కానీ తృటిలో విజయం చేజార్చుకుంది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ 164 పరుగులు మాత్రమే […]
Gaalodu Trailer: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా వెండితైరపైనా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. తాజాగా సుధీర్ నటిస్తున్న […]
T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ ఈ హ్యాట్రిక్ సాధించడం విశేషం. టీ20ల్లో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్‌పై పసికూన ఐర్లాండ్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేయడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా 19వ ఓవర్‌లో జోష్ లిటిల్ బౌలింగ్‌కు దిగి వరుస బంతుల్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, […]
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కోసం అక్రమంగా ఇళ్లను కూల్చివేయడంపై ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా అర్థాంతరంగా అలా కూలుతుందని హెచ్చరించారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన వారే తమవారని ప్రభుత్వం భావిస్తోందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఓటు వేయని వాళ్లను ‘తొక్కి నార తీయండి’ అనే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు సెమీస్ బెర్తులు ఖరారవుతున్నాయి. ఈ టోర్నీలోనే సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. శుక్రవారం నాడు గ్రూప్-1లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఇందులో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు ఉన్నాయి. 2.113 మెరుగైన రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్‌కు సెమీస్ బెర్తు ఖరారైంది. రెండో […]
ICC Rankings: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మరోసారి తన సత్తా చూపాడు. తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుత T20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో 863 పాయింట్లు సాధించి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. చాలా తక్కువ సమయంలో సూర్యకుమార్ నంబర్‌వన్ ర్యాంకును పొందాడు. మార్చి, 2021లో అరంగేట్రం చేసి తక్కువ కాలంలోనే ఈ ర్యాంకు పొందాడు. ఈ జాబితాలో 842 పాయింట్లతో పాకిస్థాన్ […]
Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని.. నాడు ప్రజల తీవ్రమైన భావావేశాన్ని ప్రదర్శించి గట్టిగా అడిగారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం […]
IND Vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకే ఒక్క మార్పు చేసింది. గత మ్యాచ్‌లో రాణించని దీపక్ హుడాపై వేటు వేసింది. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అటు బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సౌమ్య సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ లాంటి అగ్ర జట్టును ఓడించిన జింబాబ్వేకు పసికూన నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకోగా 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. సికిందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ […]
Darren Sammy: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు వెస్టిండీస్ అర్హత సాధించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తమ జట్టుకు ఈ పరిస్థితి దాపురించడానికి ఆర్ధిక విధానాలే కారణమని ఆరోపించాడు. ఆటగాళ్లకు తమ బోర్డు ఆర్ధిక భద్రత కల్పిస్తే జట్టు గాడిన పడుతుందని డారెన్ సామీ ఆశాభావం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తరహాలో ఇతర లీగుల్లో తమ ఆటగాళ్లు ఆడటాన్ని వెస్టిండీస్ బోర్డు అడ్డుకోలేదని.. […]