Unstoppable 2 Promo: ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మూడో వారం కూడా యువహీరోలే సందడి చేయబోతున్నారు. తొలి ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు, లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా రెండో ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ బాలయ్యతో ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లో కూడా ఇద్దరు యువహీరోలు కనిపించనున్నారు. వాళ్లేవరో కాదు.. శర్వానంద్, అడివి శేష్. ఈ ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా మంగళవారం విడుదల చేసింది. శర్వానంద్, అడివి శేష్ ఇద్దరూ బ్యాచ్‌లర్స్ కావడంతో ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మరింత కామెడీగా బాలకృష్ణ ఈ టాక్ షోను నడిపించారు.
Read Also: Bigg Boss 6: నామినేషన్స్‌లో ఫైమా వెటకారం.. ఈ వారం బయటకు వెళ్లడం ఖాయమేనా?
అటు రావడంతోనే శర్వానంద్ బాలయ్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత ఎపిసోడ్‌లో తన నేషనల్ క్రష్ రష్మిక అని బాలయ్య చెప్పడంతో శర్వా ఆ విషయాన్ని గుర్తుంచుకుని రష్మికకు వీడియో కాల్ చేశాడు. దీంతో బాలయ్యతో కాసేపు రష్మిక ముచ్చట్లు చెప్పింది. మరోవైపు శర్వానంద్, అడివి శేష్‌ను బాలయ్య తనదైన శైలిలో ఆటాడుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో ఎవరు నంబర్‌వన్ యాక్టర్ అని అడిగి ఇద్దరినీ ఇరకాటంలో పెట్టారు. జాను సినిమా షూటింగ్ సందర్భంగా శర్వాకు జరిగిన ప్రమాదం గురించి బాలయ్య ప్రస్తావించారు. హీరోయిన్‌ల సెలక్షన్ ఎలా చేస్తావంటూ శర్వాను సరదాగా బాలయ్య ప్రశ్నించారు. ఫోన్‌లో ఎన్ని బిట్లు ఉన్నాయంటూ అడల్ట్ క్వశ్చన్ వేయడంతో శర్వా షాక్ అయ్యాడు. ఏ హీరోయిన్‌తో కిస్ వద్దురా బాబూ అనిపించిందని అడివి శేష్‌ను బాలయ్య అడగ్గా అతడు పూజా హెగ్డే పేరు చెప్పాడు. ఇంకా మరెన్నో విశేషాల గురించి తెలుసుకోవాలంటే ఈనెల 4న స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.