Manjima Mohan: నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మంజిమా మోహన్. అనంతరం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో నటించింది. ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయాన్ని మంజిమా మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ […]
Virat Kohli: టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు ఆదివారం నాడు పెర్త్‌లో బస చేసింది. అయితే అక్కడి హోటల్ గదిలో కోహ్లీ లేని సమయంలో ఓ వ్యక్తి వెళ్లి గదిలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులను ఈ వీడియోలో చూపించాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. […]
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. అక్కడ వన్డేలు, టీ20లు ఆడనుంది. అయితే ఈ రెండు సిరీస్‌ల నుంచి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా న్యూజిలాండ్ పర్యటన తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ఆడనున్న టెస్టులు, వన్డేలకు మాత్రం స్టార్ ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. నవంబర్ 18 నుంచి […]
Gudivada Amarnath: విశాఖలో రాండ్ స్టాడ్ రిక్రూట్‌మెంట్ కంపెనీని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాండ్ స్టాడ్ లాంటి గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉన్న కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయంటే భవిష్యత్‌ను అర్ధం చేసుకోవచ్చన్నారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రఖ్యాత సంస్థలన్నీ విశాఖకు తరలివస్తుండటం సానుకూల సంకేతమని మంత్రి అమర్నాథ్ అన్నారు. జనవరి నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు […]
Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నాడు బ్రిస్బేన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ తన ఫేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అతడు మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ […]
SSMB 28: సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఖలేజా తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తల్లి ఇందిరాదేవి మరణం తర్వాత సినిమా షూటింగులకు మహేష్‌బాబు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నిర్మాత సూర్యదేవర […]
NTR 30: జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాలని భావించడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం […]
Andhra Pradesh: ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం […]