Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ల కంటే నామినేషన్ ఎపిసోడ్లే కొంచెం బాగుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా.. నామినేషన్‌లలో 10 మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ముఖ్యంగా ఫైమా-ఇనయా, రేవంత్-ఇనయా, శ్రీహాన్-కీర్తి, శ్రీహాన్-ఇనయా, బాలాదిత్య-ఫైమా మధ్య డిస్కషన్‌లు ఈ ఎపిసోడ్‌ను వేడెక్కించాయి.
Read Also: Abhiroop Basu: ‘కాంతార’పై బెంగాలీ డైరెక్టర్ విమర్శలు.. నువ్వు డైరెక్టరా అంటూ నెటిజన్లు ట్రోల్
నామినేషన్ ఎపిసోడ్‌లో ఫైమా వైఖరి చర్చనీయాంశంగా మారింది. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పినా ఫైమా వెటకారం తగ్గలేదు. పైగా ఇంకా పెరిగింది. అంతేకాకుండా వెటకారం ఎక్కువైతే కట్ చేసుకోండి బిగ్ బాస్ అంటూ ఫైమా అతి చేసింది. ఫైమాను బాలాదిత్య నామినేట్ చేసినప్పుడు ఆమె ప్రవర్తన బాగోలేదని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. పైగా మంచితనం ఎక్కువైందంటూ బాలాదిత్యను ఆమె నామినేట్ చేసిన తీరు తలదించుకునేలా ఉంది. అయితే ఈ వారం శ్రీసత్య, ఫైమాలలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఫైమా ఈ రియాల్టీ షోలో మంచి ఎంటర్‌టైనర్ అయినా ఆమె తన స్థాయికి తగ్గ రీతిలో రాణించలేకపోతోంది. శ్రీసత్య కూడా చాలా ఫేక్‌గా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అందరిమీద రేవంత్, శ్రీహాన్‌కు ఫిర్యాదులు చేయడం తప్ప ఆమె పెద్దగా ఆడుతున్నట్లు కనిపించడం లేదు. అయితే ఫైమా వర్సెస్ శ్రీసత్య అనుకున్నప్పుడు ఫైమా వికెట్ పడిపోవడం ఖాయమని గాసిప్ రాయుళ్లు చెప్పుకుంటున్నారు.