Rambha Accident: సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. రంభకు మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో అభిమానులను […]
NTR University: ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు వైసీపీ సర్కారు చేసిన తీర్మానానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీకి సభలో ఉన్న బలం ఆధారంగా సభ […]
Andhra Pradesh: ఏపీలోని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీత కార్మికులు మరణిస్తే… వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల […]
Sabari Express: గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా ఓ ఇనుప రాడ్డును ఉంచిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. కంకరగుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా కొందరు దుండగులు ఇనుప రాడ్డును బిగించారు. దీంతో సోమవారం సాయంత్రం సికింద్రాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే సమయంలో స్థానికులు ఈ ఇనుప రాడ్డును గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకో పైలెట్ మంజునాథ్ […]
Prithvi Shaw: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా విశేషంగా రాణించాడు. ఏడు మ్యాచుల్లో 47.50 సగటుతో 285 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి స్ట్రైక్ రేటు 191.28గా ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నటిప్పటికీ పృథ్వీ షాకు టీమ్‌లో చోటు దక్కకపోవడంపై పలువురు […]
Gas Prices: ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు అందించాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ధర తగ్గింపు వల్ల కేవలం కొంత మందికి మాత్రమే ఊరట లభించనుంది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును మాత్రమే తగ్గించాయి. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం స్థిరంగానే కొనసాగించాయి. Read Also: […]
What’s Today: • హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర.. పురానాపూల్, చార్మినార్, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఐమ్యాక్స్ మీదుగా సాగనున్న రాహుల్ పాదయాత్ర • రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సౌత్ జోన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు • కర్నూలు: నేడు రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్.. […]
Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అడిలైడ్‌లో బుధవారం నాడు 90 శాతం వర్షం కురిసే అవకాశం […]
Instagram Down: ప్రస్తుతం సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. దాదాపుగా అందరూ వీటిని వాడుతున్నారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ మీదే ఆధారపడుతోంది. ఇన్‌స్టా రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది అకౌంట్లు లాక్ అయిపోయినట్లు ఫిర్యాదులు పోటెత్తాయి. తమ యాప్ క్రాష్ అవుతోందని పలువురు యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 7వేల అకౌంట్లు సస్పెండ్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ […]