Venkaiah Naidu: బాపట్ల జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నాడు పర్యటించారు. వేటపాలెం మండలంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్ల బాపయ్య విద్యా సంస్థల శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. చీరాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. అన్ని దానాలలో విద్యాదానం చాలా గొప్పదని వెంకయ్యనాయుడు […]
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. గతంలో పరుగుల వరద పారించిన కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఇటీవల ఆసియా కప్ సందర్భంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన అతడు టీ20 ప్రపంచకప్‌లో మరోసారి రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు […]
Afghanistan: టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో ఆప్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. చివరకు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా తమ జట్టు నిష్క్రమించడంతో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు ఎంపికలో […]
Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిన బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ఇప్పటంలో జనసేన అభిమానుల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిందని ఆరోపించారు. వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే కొనసాగిస్తే ఇడుపులపాయలో వైసీపీ నేతల ఇళ్ల మీద […]
Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని శనివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే పోలీసులు కుట్రపూరితంగానే కంచెలు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేయడంపై ఇప్పటికే […]
Team India: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని విమర్శలు చేశాడు. ఎలాగైనా టీమిండియా సెమీస్‌కు వెళ్లాలనే ఆలోచనతోనే ఐసీసీ ఇలా […]
Koti Deepotsavam 2022: భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరో రోజుకు చేరింది. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది. కోటి దీపోత్సవం కోసం ప్రతి రోజూ ఎన్టీఆర్ స్టేడియం అందంగా ముస్తాబవుతోంది. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎన్టీవీ, […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=B6rV_PDaDrQ&ab_channel=BhakthiTV
Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం కొనాలని భావించేవారికి శుభవార్త అందింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.660 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290గా ఉంది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.64,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ […]