Koti Deepotsavam 2022: భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరో రోజుకు చేరింది. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది. కోటి దీపోత్సవం కోసం ప్రతి రోజూ ఎన్టీఆర్ స్టేడియం అందంగా ముస్తాబవుతోంది. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాయి.
నవంబర్ 05, కోటి దీపోత్సవం 6వ రోజు విశేష కార్యక్రమాలు:
* విద్యాశంకర భారతి స్వామిజీచే అనుగ్రహ భాషణం
* బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనామృతం
* శ్రీనివాసుడికి విశేష స్నపన తిరుమంజనం
* సింహాద్రి అప్పన్నకు కోటి తులసి దళార్చన
* విష్ణుమూర్తి విగ్రహాలకు భక్తులచే తులసీ దళాలతో అర్చన కార్యక్రమం
* సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం
* కల్పవృక్ష వాహన సేవ
* ఇలకైలాసంలో భక్తులచే సామూహిక కార్తీక దీపారాధన
* కనీవినీ ఎరుగని రీతిలో కార్తీకమాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యం
* ఇంటిల్లిపాదికి సమస్త శుభాలు కలుగజేసే సప్త హారతి