What’s Today: • అమరావతి: నేడు ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఇప్పటం ప్రజలను కలవనున్న పవన్ కళ్యాణ్ • రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో నేడు ఓబీసీ మోర్చా సమ్మేళనం.. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు • నంద్యాల: నేడు ప్యాపిలి మండలం ఓబులదేవరపల్లిలో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రాంభించనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి • నేటి పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం […]
భక్తి టీవీ కోటి దీపోత్సవం ఐదో రోజు అంగరంగ వైభవంగా సాగింది. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదో రోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్‌రావు దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవంలో భాగంగా ముందుగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతర బ్రహ్మశ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం జరిగింది. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు. […]
Andhra Pradesh: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తప్పిదం జరిగింది. ఆప్ఘనిస్తాన్ బౌలర్ ఓవర్‌కు ఐదు బంతులే వేశాడు. కానీ ఈ విషయాన్ని అంపైర్లు గమనించలేదు. కానీ లైవ్‌లో మ్యాచ్ చూస్తున్న అభిమానులు మాత్రం ఈ తప్పిదాన్ని గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్‌ను ఆప్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. తొలి […]
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశాడని ఆరోపించారు. ఆయన విషపు రాజకీయ కుట్రలో ఇది ఒక కోణమని.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై తానే రాయి విసిరించుకున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ దమ్మున్న నాయకుడు అని.. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా సంయమనంతో వ్యవహరించి ప్రజల మనసులను […]
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం ఐదో రోజుకు చేరింది. దీంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. కార్తీక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక జరుగుతోంది. కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన భక్తులు స్వయంగా చేపట్టారు. అటు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అనంతరం సింహ వాహనం […]
NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా అధికారి మధుబాబుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన బుగ్గ వెంట రక్తం కారింది. వైద్యులు వెంటనే స్పందించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు ఇదే ఘటనలో చంద్రబాబు పీఎస్‌వోకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి రాయి విసిరిన సమయంలో విద్యుత్ […]
Police Statement: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రెక్కీ నిర్వహించారన్న వార్త కలకలం సృష్టించింది. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పవన్ రెక్కీ వివాదంపై దర్యాప్తు జరపాలని.. ఒకవేళ తెలుగు రాష్ట్రాల వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వం బరిలోకి దిగి విచారణ చేయిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. తాజాగా ఈ అంశంపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ లేదా దాడికి […]
Telugu Desam Party: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనితో పాటు గురువారం అయ్యన్న పాత్రుడు వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ […]
YSRCP Leaders: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ కాపు, రెడ్డి, కమ్మ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల ఛైర్మన్‌లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై రెక్కీ తన ఆధ్వర్యంలోనే జరిగిందని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తన కారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. అయితే తన […]