Krishna District: కృష్ణా జిల్లా మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు గర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బందరు డీఎస్పీ భాషా, పెడన రూరల్ సీఐ వీరయ్య ప్రసన్నగౌడ్, గూడూరు ఎస్సై వెంకట్ […]
Viral Photo: సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆటోలు, బస్సులు, రైళ్లలో వెళ్తూ పుస్తకాలు తీసి తెగ చదివేస్తుంటారు. ఏడాది మొత్తం చదవకపోయినా పరీక్షల ముందు మాత్రం విద్యార్థులు తెగ చదివేయాలని తపన పడుతుంటారు. అయితే రైల్వే ప్లాట్‌ఫారాలపై గుంపులుగా విద్యార్థులందరూ ఒకచోట చేరి చదువుకోవడం మాత్రం కనిపించదు. మహా అయితే ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఇలా కనిపిస్తారు. కానీ బీహార్ రాష్ట్రంలోని ససారం రైల్వేస్టేషన్‌లో మాత్రం ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. […]
Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్ కోసం పోలెండ్ జట్టు ఖతార్ చేరుకుంది. అయితే పోలెండ్ జట్టు యుద్ధ విమానాల సహాయంతో ఖతార్ చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలెండ్ జట్టు తమ దేశ సరిహద్దు దాటే వరకు ఎఫ్-16 యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల పోలెండ్ సరిహద్దులో ఓ క్షిపణ పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాట్ జట్టు భద్రత కోసం ఇలా ఆ దేశ […]
Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు సాధారణంగా బ్యాంకులు రోజులో ఆరేడు గంటలు పనిచేస్తుంటాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం అరగంటే పనిచేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బడిలోని బ్యాంక్. ఇక్కడ స్కూల్ విద్యార్థులే ఉద్యోగులు. వాళ్లే ఇక్కడ బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల చొరవతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేసుకుని […]
Andhra Pradesh: చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. […]
Andre Russell: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ బాటలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటోను రస్సెల్ షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అద్దం ముందు నిలుచుని న్యూడ్‌గా తీసుకున్న ఫోటోను రస్సెల్ షేర్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఫోటోలో తన జననాంగం కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ […]
What’s Today: • తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఈరోజు, రేపు చలి పెరిగే అవకాశం.. తెలంగాణలోని వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు • హైదరాబాద్: నేడు, రేపు ఫార్ములా ఈ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రయల్ రన్ • తూర్పుగోదావరి జిల్లా్: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు • విజయవాడ: […]
Shirdi: ఏపీలోని తిరుమల తర్వాత దేశంలో హుండీ ఆదాయం అధికంగా ఉన్న ఆలయం మహారాష్ట్రలోని షిర్డీ మాత్రమే. కరోనా తర్వాత ఆంక్షలు సడలించడంతో షిర్డీ సాయినాథుడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో షిర్డీ సాయినాథునికి రికార్డు స్థాయిలో హుండీ కానుకలు వచ్చి చేరుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ నవంబర్ వరకు బాబా సంస్థాన్‌కు రూ.398 కోట్ల కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. […]
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైసీపీ హయాంలో వెనక్కి […]
IND Vs NZ: న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన భారత్- న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ వేసే సమయానికి స్టేడియాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ కారణంగా టాస్ కూడా పడలేదు. పలు మార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం […]