CIBIL Score: సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా.. అయితే ఇలా చేయండి..
- క్రెడిట్ స్కోర్ తగ్గడానికి ప్రధానంగా 5 కారణాలు
- క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం
- 500 లేదా 600 దగ్గరే ఆగిపోతున్న సిబిల్ స్కోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది తమ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లిస్తారు. కానీ కొన్ని సార్లు ఆర్థిక పరిస్థితుల కారణంగా, కొన్ని చెల్లింపులు వాయిదా పడుతాయి. దీని ఫలితంగా, కొన్ని వ్యక్తుల క్రెడిట్ స్కోరు 500 లేదా 600 దగ్గరే ఆగిపోతుంది. అంతేకాక, కొందరు తమ రుణాలను సకాలంలో చెల్లించినప్పటికీ, సిబిల్ స్కోరు పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సమస్య కేవలం చెల్లింపుల్లోనే కాదు; మనకు తెలియకుండా చేసే చిన్నపాటి పొరపాట్లు కూడా సిబిల్ స్కోరుకు ప్రతికూల ప్రభావం చూపుతాయి.
నిపుణుల ప్రకారం, క్రెడిట్ స్కోర్ తగ్గడానికి ప్రధానంగా ఈ 5 కారణాలు ఉంటాయి:
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
1.అనవసరంగా ఎక్కువ క్రెడిట్ కార్డులు తెరవడం – అవసరానికి మించిన క్రెడిట్ కార్డులు తెరవడం స్కోరుకు ప్రతికూలంగా ఉంటుంది.
2.తక్కువ చెల్లింపులు లేదా ఆలస్యంగా చెల్లింపు – పెద్ద ఈఎంఐలు సరిగా చెల్లించినా, చిన్న బిల్లులు లేదా చెల్లింపు తేదీకి కొద్దిగా ఆలస్యం జరిగితే కూడా స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది.
3.క్రెడిట్ రేషియో ఎక్కువగా ఉండడం – మీ క్రెడిట్ లిమిట్‌లో ఉన్న రుణాన్ని ఎక్కువగా వాడడం స్కోరు తగ్గించే ప్రధాన కారణం.
4.పాత డిఫాల్ట్‌లు లేదా రిపోర్ట్‌లో ఉన్న సమస్యలు – గతంలో చెల్లింపులు చేయని, డిఫాల్ట్ అయిన లేదా రిపోర్ట్‌లో ఉన్న రుణాలు స్కోరు పెరగడాన్ని అడ్డుకుంటాయి.
5.రుణాల సమతుల్యత లేమి – క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాల సమతుల్యమైన మిశ్రమం లేకపోవడం కూడా సిబిల్ స్కోరు పెరుగడాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి, మీ క్రెడిట్ స్కోరు పెంచాలంటే, చిన్న పొరపాట్లను గుర్తించి, సకాలంలో చెల్లింపులు చేయడం, రుణాలను సమర్థవంతంగా వాడడం, పాత రిపోర్ట్‌లను పరిశీలించడం అత్యంత అవసరం. దీన్ని పాటిస్తే, మీరు మీ సిబిల్ స్కోరును స్థిరంగా పెంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?