Andre Russell: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ బాటలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటోను రస్సెల్ షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అద్దం ముందు నిలుచుని న్యూడ్‌గా తీసుకున్న ఫోటోను రస్సెల్ షేర్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఫోటోలో తన జననాంగం కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రస్సెల్‌కు ఇదేం పాడు బుద్ధి అని.. పోయే కాలం వచ్చిందా అని నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు. రణ్‌వీర్‌సింగ్‌ను రస్సెల్ తలదన్నేలా ఉన్నాడుగా అంటూ పలువురు నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు.
Andre Russell Instagram post. Ranveer Singh lite 😂#INDvNZ #INDvsNZ#NZvIND #NZvsIND pic.twitter.com/uxKy831pyB
— Abdullah Neaz (@cric___guy) November 18, 2022
కాగా ఐపీఎల్‌లో చాలా కాలం నుంచి కోల్‌కతా నైడరైడర్స్‌కు రస్సెల్ ఆడుతున్నాడు. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా అతడిని కోల్‌కతా జట్టు రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న రస్సెల్ ఇటీవల టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరంగా ఉన్నాడు. దీంతో అతడు తన ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్‌లో గంటలు తరబడి చెమటోడ్చుతున్నాడు. వర్కవుట్లకు సంబంధించిన సెల్ఫీని కూడా రస్సెల్ అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా తన లోయర్ బాడీ బలహీనంగా ఉంటుందని చాలా సార్లు చెప్పిన రస్సెల్.. ఆ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు.
Read Also: Rajashekar: వెబ్ సిరీస్ లపై మనసుపడ్డ యాంగ్రీ యంగ్ మెన్