NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి కళ్యాణ్‌రామ్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ […]
Rain Alert: ఏపీ ప్రజలను మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేయనున్నాయి. ఐఎండీ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి శ్రీలంకకు తూర్పున 600 కి.మీ. దూరంలో, తమిళనాడులోకి కారైకల్‌కు 630 కి.మీ. దూరంలో, చెన్నై తీరానికి 670 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. నెమ్మదిగా వాయుగుండం కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని […]
Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.లక్షలోపు పంట రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్ఆర్ సున్నావడ్డీ రాయితీని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్‌లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 2.54 లక్షల మంది ఖాతాల్లో రూ.45.22 కోట్ల నిధులను అధికారులు జమచేయనున్నారు. రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని నేటి నుంచి […]
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే […]
Kakani Govardhan Reddy: ఏపీలో తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీ ప్రభుత్వ విధానాలను ఆరోపిస్తూ ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని.. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని అర్థం అవుతోందని మంత్రి కాకాణి అన్నారు. కర్నూలు పర్యటనపై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని.. కర్నూలులో న్యాయ రాజధాని విషయంలో […]
Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సి్ల్ (ఐసీసీ) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగినా ఇవి ఫలించలేదు. ఎట్టకేలకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు ఉండవచ్చని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ బ్రిటీష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ ప్రకటించింది. గత 100 సంవత్సరాలలో మొదటిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చనున్నట్లు […]
Chiranjeevi Live: మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఉన్నారు. శ్రీవైఎన్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవైఎన్ కాలేజీ అల్యూమినీ మీట్‌లో తన చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు.
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంలోనూ పవిత్ర లోకేష్ గురించి నరేష్ వారికి పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో హీరో, హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన […]
Dwajarohana Utsavam Live: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అధకారులు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. https://www.youtube.com/watch?v=AJHynW0gPzM
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషశెట్టితో ఈరోజు నాగశౌర్య వివాహం జరగనుంది. ఈ రోజు ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదిక కానుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నాగశౌర్య వివాహానికి హాజరుకానున్నారు. అటు శనివారం హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో […]