Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్ కోసం పోలెండ్ జట్టు ఖతార్ చేరుకుంది. అయితే పోలెండ్ జట్టు యుద్ధ విమానాల సహాయంతో ఖతార్ చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలెండ్ జట్టు తమ దేశ సరిహద్దు దాటే వరకు ఎఫ్-16 యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల పోలెండ్ సరిహద్దులో ఓ క్షిపణ పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాట్ జట్టు భద్రత కోసం ఇలా ఆ దేశ ప్రభుత్వం యుద్ధ విమానాలను పంపింది. పోలెండ్ దక్షిణ సరిహద్దు వరకు ఎఫ్-16 యుద్ధ విమానాలు తమకు రక్షణగా వచ్చినట్లు పోలెండ్ జట్టు పలు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Andre Russell: న్యూడ్ ఫోటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్.. రణ్‌వీర్‌సింగ్‌ను తలదన్నేలా ఉన్నాడుగా..!!
కాగా దాదాపు పది నెలలపైగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు జరిగిన చర్చల్లో ఏవీ పూర్తిగా సఫలం కాలేదు. దీంతో ఇది కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయినా సరే రష్యా వెనక్కు తగ్గలేదు. ఉక్రెయిన్‌తో తాము యుద్ధం చేయడం లేదని, ఇది కేవలం స్పెషల్ సైనిక చర్య మాత్రమేనని రష్యా వాదిస్తోంది. యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌ను ఆనుకుని ఉన్న పోలెండ్‌లోని ఓ గ్రామంపై కూడా దాడి జరిగింది. దీంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందిన పోలెండ్ ప్రభుత్వం రక్షణ దళాలను రంగంలోకి దింపింది.