Mahesh Babu: టాలీవుడ్‌లో మహేష్‌బాబు ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. తండ్రి మరణంతో మహేష్‌బాబు తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన తండ్రి పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అతడి అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. తమ అభిమాన హీరోను ఇలా చూడటం తమ వల్ల కావడం లేదని […]
Twitter: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం బ్లూటిక్ ఛార్జీలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా బ్లూ టిక్ రూల్స్ మార్చడంతో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది బ్లూ టిక్ కోసం చందా కట్టి నకిలీ ఖాతాలను తెరవడం ప్రారంభించారు. అయినా ఛార్జీల వసూలు విషయంలో ఎలాన్ మస్క్ తగ్గలేదు. దీంతో ట్విట్టర్ యూజర్లు.. సెలబ్రిటీల అసలు అకౌంట్ ఏదో, నకిలీ అకౌంట్ ఏదో […]
GVL Narasimha Rao: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్‌ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్‌గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్‌కు ఎందుకు అని నిలదీశారు. […]
Password: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యాప్‌లు ఎక్కువగా వాడాల్సి వస్తోంది. యాప్‌లలో ఉండే మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే పాస్ వర్డ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఖాతాల్లోకి మరొకరు సులభంగా ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి గేటు పాస్‌వర్డ్. అందుకే పాస్ వర్డ్‌ను బలంగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితు కొంత మందికి పాస్ వర్డ్ ఎలా పెట్టాలో కూడా అవగాహన ఉండటం లేదు. సులభంగా గుర్తు ఉండేలా కొందరు ఎక్కువ ప్రచారంలో ఉన్న సంస్థలు, […]
Superstar Krishna Live Updates: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
Hardik Pandya: ఈ నెల 18 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే […]
Narayana Murthy: భారత్ తయారుచేసిన దగ్గుమందు కారణంగా జాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో భారత్‌పై ఆఫ్రికా దేశం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఈ అంశంపై స్పందించారు. భారత్‌లో తయారైన దగ్గుమందు 66 మంది చిన్నారుల మృతికి కారణమైందన్న ఆఫ్రికా ఆరోపణలు మనదేశానికి సిగ్గుచేటు అని అభిప్రాయపడ్డారు. కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ప్రశంసలు పొందిన మనదేశానికి దగ్గుమందు అపవాదు […]
Swimming: ప్రస్తుత కాలంలో ఆధునిక పోకడల కారణంగా 30 ఏళ్లు వచ్చేసరికి కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. 50 ఏళ్లు వచ్చేసరికే సొంత పనులు చేసుకోవడానికే ఆపసోపాలు పడుతున్నారు. కానీ 82 ఏళ్ల బామ్మ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో అదరగొడుతోంది. ఈ వయసులోనూ మూడు బంగారు పతకాలు సాధించి అందరి నోళ్లు మూయించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ గాంధీనగర్‌లో మంగళవారం నాడు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. 50 మీటర్ల […]
Kakinada: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా మేజిక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా మ్యాజిక్‌లో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. Read Also: కాగా ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న […]
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం హౌస్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో కెప్టెన్ ఫైమా తప్పితే అందరూ ఉన్నారు. దీంతో ఓటింగ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఖాళీ చెక్‌లు ఇచ్చారు. ఆ చెక్కులపై కొంత అమౌంట్ వేయాలని.. ఎవరైతే […]