ఓ మర్డర్ ఎటెంప్ట్ కేసులో సాక్ష్యం చెప్పేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు నారాయణపేట జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2009లో కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్‌కు చెందిన అప్పటి కాంగ్రెస్ నేత కృష్ణతో పాటు మరో 12 మంది హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి పిటిషనర్‌గా ఉన్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి శుక్రవారం రోజు ఆయన జిల్లా కోర్టులో హాజరై సాక్ష్యం చెప్పారు. 2018లోనూ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం నాడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా జగన్ హాజరుకానున్నారు. ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా అంతకుముందు విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. Read Also: సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా సీఎం జగన్ తొలుత […]
‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. తన తండ్రి పని అయిపోయింది అన్న వాళ్లకు తాను సమాధానం చెప్తానని ప్రకటన చేశాడు. పూరీ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నాడు. తన తాత సింహాచలం నాయుడు పేరు ఎవరికీ తెలియదని.. కానీ తన తండ్రి పూరీ జగన్నాథ్ పేరు అందరికీ తెలుసని మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు ఫెయిల్ అయితే వాడిపై సింపతీ […]
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. అతడు వరంగల్ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తాడని ఎర్రబెల్లి వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చాడని, ఈరోజు కూడా వచ్చాడని ఎర్రబెల్లి […]
డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఆమె కొరియాకు చెందిన సీడ్‌యన్ సియాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-21, 12-21 తేడాతో పోరాడి ఓటమి పాలైంది. దీంతో ఆమె సెమీస్‌కు వెళ్లకుండా ఇంటి దారి పట్టింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె 67 నిమిషాల పాటు పోరాడగా.. ఈ పోరులో మాత్రం ఆమె 36 నిమిషాలకే చేతులెత్తేసింది. Read Also: సూపర్-12లోకి […]
ప్రముఖ నటి, ‘మయూరి’ సుధాచంద్రన్‌కు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుధాచంద్రన్ గతంలో ఓ ప్రమాదంలో కాలు కోల్పోగా.. ఆమె జైపూర్ కాలు పెట్టించుకున్నారు. అయితే ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు అక్కడ తనిఖీలలో భాగంగా ఆమె కృత్రిమ కాలును తొలగించాలని భద్రతా అధికారులు ఆదేశించారు. దీంతో సుధాచంద్రన్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ […]
వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని […]
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ A నుంచి శ్రీలంక, నమీబియా… గ్రూప్ B నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కు అర్హత సాధించాయి. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో నమీబియా సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ జట్టులో పార్ల్ స్టిర్లింగ్ 38 […]
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కేంద్రమంత్రి లాంటి పదవిలో ఉండి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని తాను నిరూపిస్తానని ఆయన పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్ ఛార్జ్ పేరుతో పెట్రోల్‌పై రూ.22.47ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నులు పెంచిందని హరీష్ […]
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల కాగా మరోవైపు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ‘భీమ్లానాయక్’ సినిమా ఒకటి. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో ‘భీమ్లానాయక్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. […]