టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ముందడుగు వేసింది. ఎట్టకేలకు గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ 12లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పసికూన పపువా న్యూగునియాపై 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్ అయినా షకీబ్ (46), లిటన్ దాస్ (29), కెప్టెన్ మహ్మదుల్లా (50) చెలరేగి ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ 181/7 భారీ స్కోరు సాధించింది.
అనంతరం 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోగి దిగిన పపువా న్యూగినియాను 97 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ చేసింది. షకీబ్ బౌలింగ్‌లో కూడా సత్తా చాటి నాలుగు వికెట్లు తీసి పపువా న్యూగినియా నడ్డి విరిచాడు. షకీబ్ నాలుగు ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడికి సైఫుద్దీన్ (2 వికెట్లు), టస్కీన్ అహ్మద్ (2 వికెట్లు), మెహేదీ హసన్ మిరాజ్ (1 వికెట్) సహకరించారు. వికెట్ కీపన్ డోరిగా (46 నాటౌట్), సోపర్ (11) తప్ప మరెవ్వరూ రాణించలేదు. కాగా ఈనెల 23న టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.