సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 సంస్థ ప్రకటన చేసింది. 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘పలాస’ ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించాడు.
Read Also: కోలుకున్న అడివి శేష్… డబుల్ ఎనర్జీతో బ్యాక్
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆగస్టు 27వ తేదీ ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్‌గా నటించింది. నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, సప్తగిరి ప్రధాన పాత్రలను పోషించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించాడు. కాగా ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా హీరో సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి.