ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని […]
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో కేశినేని నాని పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు శుక్రవారం నాడు ఎంపీ కేశినేని నాని సంఘీభావం ప్రకటించారు. తాజా పరిణామంతో తెలుతు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని అలక వీడినట్లే అని అభిప్రాయపడుతున్నారు. Read Also: టీడీపీని […]
శనివారం నుంచే టీ20 ప్రపంచకప్ పోరు షురూ కానుంది. టోర్నీ మొదలైన రెండో రోజే మహాయుద్ధం జరగనుంది. అదే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య పోరు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లలో కూడా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో […]
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలనే మూట్టగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం లాభాలతోనే మొదలైనా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుంచి క్రమం సూచీలు పడిపోతూ వచ్చాయి. ఒకదశలో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు చివరకు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 60,821 వద్ద ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 18,114 పాయింట్ల వద్ద స్థిరపడింది. Read Also: ఎంజీ అస్టర్ రికార్డ్: 20 నిమిషాల్లో […]
తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని […]
క్రికెట్‌లో కాసులు కురిపించే ఐపీఎల్‌కు మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ అటు బీసీసీఐకి.. ఇటు ఆటగాళ్లకు బంగారు కోడిపెట్ట లాంటిది. అందుకే ఐపీఎల్ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఈ ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియను షురూ చేసింది. కొత్తగా రానున్న రెండు జట్లలో ఓ జట్టును సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ టాప్ కపుల్ ప్రయత్నాలు చేస్తోంది. Read […]
దేశంలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా వధువు దొరకడం లేదు. దీంతో దేశంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొందరు యువకులు తహీసీల్దార్‌కు వెరైటీగా లెటర్ రాశారు. తాము పెళ్లి చేసుకోవాలంటే యువతులు దొరకడం లేదని.. తమకు వధువును వెతికిపెట్టాలని సదరు లెటర్ ద్వారా కోరారు. ఈ ఘటన తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండవహళ్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో […]
రెండు సార్లు ఒలింపిక్స్ పతకం విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటుతోంది. డెన్మార్క్ ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌కు సంబంధించి 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-16, 12-21, 21-15 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై పీవీ సింధు విజయకేతనం ఎగురవేసింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్. మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొంటున్న […]
యువ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రాత్రి ఆరడగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి విడుదల చేశాడు. ట్రైలర్ చూస్తుంటే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూ వర్మ కనిపించారు. ఈ మూవీలో పెళ్లి అంటే ఇష్టం లేని యువతిగా రీతూ వర్మ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ […]
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు కాలి బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మంటల్లో కాలిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నేలమర్రి గ్రామానికి చెందిన సన్నకారు రైతు కప్పల లక్ష్మయ్యకు రెండు ఎకరాల పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం తన తండ్రికి చెందిన ఆస్తి అమ్మడంతో […]