క్రికెట్‌లో కాసులు కురిపించే ఐపీఎల్‌కు మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ అటు బీసీసీఐకి.. ఇటు ఆటగాళ్లకు బంగారు కోడిపెట్ట లాంటిది. అందుకే ఐపీఎల్ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఈ ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియను షురూ చేసింది. కొత్తగా రానున్న రెండు జట్లలో ఓ జట్టును సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ టాప్ కపుల్ ప్రయత్నాలు చేస్తోంది.
Read Also: వారెవ్వా… ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టాడు
రణ్‌వీర్-దీపికా పదుకునే జంట ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ బిడ్డింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే సదరు వ్యాపారవేత్త అదానీ గ్రూప్‌కు చెందిన వ్యక్తి అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. వారిలో షారుఖ్ ఖాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), ప్రీతి జింటా (పంజాబ్ కింగ్స్), శిల్పాశెట్టి (రాజస్థాన్ రాయల్స్) ఉన్నారు. కాగా ఈనెల 25న బీసీసీఐ కొత్త ఐపీఎల్ జట్లను ప్రకటించనుంది. ఇప్పటికే ఐపీఎల్‌లో 8 జట్లు ఉండగా.. ఆ సంఖ్య 10కి చేరనుంది.