యువ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రాత్రి ఆరడగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి విడుదల చేశాడు. ట్రైలర్ చూస్తుంటే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూ వర్మ కనిపించారు. ఈ మూవీలో పెళ్లి అంటే ఇష్టం లేని యువతిగా రీతూ వర్మ కనిపించనుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 29న థియేటర్లలో విడుదల కానుంది. తొలుత దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా మూడు సినిమాలు పోటీకి దిగడంతో వరుడు కావలెను యూనిట్ వెనక్కు తగ్గింది.