ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్ ఫీవర్ నెలకొంది. ఇప్పటికే అసలు పోరు ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మహా సమరం జరగనుంది. అయితే కొన్ని రికార్డుల గురించి తెలుసుకోవాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయ్యిందో ఎవరో తెలుసుకుందాం పదండి. Read Also: టీమిండియాతో తలపడే పాకిస్థాన్ జట్టు ఇదే టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌లలో పాకిస్థాన్ […]
ఈటెలను రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు అధికార పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడ్డాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు ఆ రెండు పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటెల, తాను కలిసిన మాట నిజమేనన్నారు. అయితే తాము చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మే 7న […]
ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై హోం వర్క్ భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ చట్టం ద్వారా తీసుకురాబోయే నిబంధనలను అమలు చేసే బాధ్యతను స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలకు హోంవర్క్ తగ్గించడమే కాకుండా పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ఈ చట్టం ద్వారా […]
ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సదరు పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరిగింది. పట్టాభి అరెస్టుకు సంబంధించి పోలీసులు సరైన విధానం పాటించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందుకు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని కోర్టు నిలదీసింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం […]
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఎందరో జీవితాలు కకావికలం అయ్యాయి. కరోనా కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఉపాధి కోల్పోయారు. అంతేకాకుండా కరోనా మనిషి సగటు ఆయువులో కూడా కోత పెట్టేసింది. సాధారణంగా గతంలో ఓ మనిషి ఆరోగ్యంగా ఉంటే వందేళ్లు జీవించేవాడు. కానీ మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి సగటు ఆయువు తగ్గిపోయింది. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చి ఇంకా ఆయువులో కోత పెట్టిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవల […]
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రహస్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాళ్లిద్దరూ హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హోటల్‌లో కలిశారన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్‌ను కలిసిన మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు కాదన్నారు. Read Also: మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి రాజాసింగ్ […]
మాలీకి చెందిన ఓ మహిళ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రసవం సాధారణంగా ఏమీ జరగలేదు. మాలీకి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఓ పాప పుట్టింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు డాక్టర్ చెకప్‌కు వెళ్లగా.. వైద్యులు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కానీ నెలలు గడిచేకొద్దీ హలీమాకు పొట్ట మరింత పెరిగింది. దీంతో ఏడుగురు పిల్లలు […]
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకరమైనదని అభివర్ణించారు. ఎవరు ఎమ్మెల్యే ఉండాలి అనేది కాదు… ఈ రాష్ట్రం ఎటు పోవాలి అనే దాని కోసం ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఇంతమంది జనం చూసిన తర్వాత ఇంకా ఎన్నిక నిర్వహించడం అవసరమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ జనం చూసి కేసీఆర్ […]
టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ఒకరోజు ముందే ప్రకటించింది. 12 మంది సభ్యులతో పాక్ టీమ్ జట్టును ప్రకటించగా.. అందులో బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ […]
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి, కేంద్రమంత్రులకు చంద్రబాబు వివరించనున్నారు. ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరనున్నారు. Read Also: విశాఖ టూర్… వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్ కాగా వైసీపీ కార్యకర్తలు […]