దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలనే మూట్టగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం లాభాలతోనే మొదలైనా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుంచి క్రమం సూచీలు పడిపోతూ వచ్చాయి. ఒకదశలో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు చివరకు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 60,821 వద్ద ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 18,114 పాయింట్ల వద్ద స్థిరపడింది.
Read Also: ఎంజీ అస్టర్ రికార్డ్: 20 నిమిషాల్లో 5 వేల కార్లు బుకింగ్
కీలక రంగాల్లో స్టాక్ హోల్డర్లు లాభాలకు మొగ్గు చూపడమే మార్కెట్ నష్టాలకు కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్‌లో కొటక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడగా.. ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ, మారుతీ సుజుకీ, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోయాయి. కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.85 వద్ద ట్రేడవుతోంది.