మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పోరులో భారత్ గెలవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేకపూజలు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో కొందరు అభిమానులు ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అంతేకాకుండా భారత టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు కూడా పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టుపై భారత్ ఓడిపోలేదని.. ఈ మ్యాచ్‌లోనూ అదే రికార్డు కొనసాగించాలని […]
ప్రభుత్వ పెద్దల నుంచి సామాన్యుల వరకు అందరూ కార్పొరేట్ వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత రోజుల్లో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె నిండు గర్భిణీ కావడంతో శుక్రవారం నాడు పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని […]
తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భూమా సినీ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఈ కాంప్లెక్సులోని విఖ్యాత్ థియేటర్ బాల్కనీలో ఉండే 180 సీట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. కాగా కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ థియేటర్‌లో ప్రదర్శనలు నిలిపివేశారు. Read Also: నిజాయతీకి ప్రతిఫలం.. 54వ సారి IAS అధికారి బదిలీ కాగా ప్రమాదం […]
హర్యానా ప్రభుత్వం శనివారం నాడు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు సాధారణమే అయినా తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన బదిలీ కావడం తన 29 ఏళ్ల సర్వీసులో ఇది 54వ సారి కావడం విశేషం. ఆయన పేరు అశోక్ ఖేంకా. ఆయన హర్యానా ప్రభుత్వ ఆర్కివ్స్, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్టుమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. Read Also: పిల్లలకు హోంవర్క్ […]
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ అదరగొట్టాడు. గ్రూప్-1లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. 2.2 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన రషీద్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభణతో 14.2 ఓవర్టలో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 56 పరుగుల స్వల్ప విజయలక్ష్యం నిలిచింది. క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో అత్యధికం. […]
తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులను పునరుజ్జీవింపజేయాలని కేసీఆర్ అన్నారు Read Also: అచ్చెదిన్: ఏడాదిలో రూ.306 పెరిగిన సిలిండర్ తెలంగాణలో అడవిపై […]
టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్, […]
తెలుగులో బిగ్‌బాస్-5 రసవత్తరంగా సాగుతోంది. కాంట్రవర్సీలతో హీట్ పుట్టించే ఈ రియాలిటీ షో ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో ఈ వారం ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. […]
దీపావళి కానుకగా సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదికగా మరో సినిమా అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ఓటీటీ డేట్స్ ఫిక్సయింది. ఈ మూవీ నవంబర్ 4 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా నేహాశెట్టి నటించింది. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని ఆరోపించారు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేదా వాళ్ల ఆఫీసు పగల గొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో స్పష్టత కరువైందన్నారు. అసలు ఢిల్లీ పర్యటనలో ఆయన్ను పలకరించేవారే లేరని ఎద్దేవా చేశారు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు […]