తెలంగాణలో ఆంత్రాక్స్ చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. గొర్రెల వరుస మరణాలను ఆంత్రాక్స్ కారణమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్నిరోజులగా రోజుకొక గొర్రె చనిపోతుండటంపై పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు చనిపోయిన […]
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని […]
టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు. […]
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత […]
విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం […]
జమ్మూకాశ్మీర్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసెంబ్లీ సీట్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది జరగ్గానే ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆయన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. Read Also: వరదల్లో వెరైటీ పెళ్ళి.. ఎక్కడో తెలుసా? జమ్మూ కాశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ […]
టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 10 మిలియన్ల (1 కోటి) మందికి పైగా ఒకేసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ ఏడాదిలో హాట్ స్టార్ సంస్థ 10 మిలియన్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా 2019 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌ను 25.3 మిలియన్ల మంది […]
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) […]
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హుజురాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతు ఇచ్చినా, బీజేపీకి ఓటు వేసినా […]
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్‌లో నిశాంక, అవిష్క ఫెర్నాండో వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో […]