పొగమంచు కారణంగా ప్రధాని మోడీ హెలికాప్టర్ ప్రయాణం ఆగిపోయింది. మోడీ శనివారం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. హైవే ప్రాజెక్టులను ప్రారంభించి.. అనంతరం బీజేపీ పరివర్తన్ సంకల్ప సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ తిరిగి కోల్‌కతాలో ల్యాండ్ అయిపోయింది.
ఇది కూడా చదవండి: Bihar Hijab Controversy: హిజాబ్ వైద్యురాలికి బంపర్ ఆఫర్.. 3లక్షల జీతం.. కోరుకున్న ఉద్యోగం.. ఎక్కడంటే..!
దీంతో బీజేపీ పరివర్తన్ సంకల్ప సభను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌పై మోడీ ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం అక్రమ వలసదారులను కాపాడుతోందని ఆరోపించారు. చొరబాటుదారులకు మద్దతు ఇస్తుందని.. అందుకే వారంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తనను.. బీజేపీని ఎంతగానైనా వ్యతిరేకించండి.. కానీ బెంగాల్ పురోగతిని ఆపోద్దని కోరారు. రాష్ట్రంలో పాలక వర్గం అభివృద్ధి పనులను అడ్డుకుంటుందని మోడీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు మరో బిగ్ షాక్.. అవినీతి కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష
ఇటీవలే ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే చేపట్టింది. దాదాపు 58 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల జరగనున్నాయి. ఈసీ తొలి ఓటర్ ముసాయిదా ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ బెంగాల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఐదు నెలల్లో ఇది మూడో పర్యటన.