టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పిచ్‌పైనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. జట్ల వివరాలు భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, […]
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 37,744 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 20,63,577 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,44,132 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా రాష్ట్రంలో 5,102 కరోనా యాక్టివ్ కేసులు […]
టీమిండియా జట్టులో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడిపై చాలా అంచనాలున్నాయి. అయితే అతడు చాలా స్పెషల్. ఎందుకంటే 2007లో టీమిండియా ఆడిన ప్రపంచకప్ జట్టులో.. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ఒకేఒక్కడు రోహిత్ మాత్రమే. 2007లో 20 ఏళ్ల వయసులోనే రోహిత్ ప్రపంచకప్ ఆడాడు. అప్పుడు జట్టులో అతడే యువకుడు. ఇప్పుడు మాత్రం అతడు […]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం సోమ, మంగళవారాల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం సభ్యులు రెండు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తం కేఆర్ఎంబీ టీమ్‌లో 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జెన్ కో అధికారులు ఉన్నారు. Read Also: వైరల్ పిక్: చీర కట్టులో […]
టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అతడికి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాల్లో నాలుగైదు హిట్లే ఉన్నా అతడి నటనకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల ద్వారా ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ కోసం […]
కోతి వేషాలు మనకు తెలియనిది కాదు. అయితే కోతి వేసే వేషాలు చూస్తే నవ్వు రాక మానదు. తాజాగా ఓ కోతి చీరను పట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. చేతికి దొరికిన చీరను కప్పుకుని సిగ్గులొలికింది. ఈ సీన్ ఏపీలో శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద చోటు చేసుకుంది. Read Also: ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ? దీంతో కోతి చేష్టల దృశ్యాలను పలువురు ఆసక్తిగా తిలకించడమే కాకుండా సెల్‌ఫోన్‌లలో బంధించారు. రోడ్డుపై […]
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. సానుభూతి వస్తుందనుకుంటే జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని ఆయన ఆరోపించారు. పట్టాభి తిట్టింది జగన్‌ను కాదని.. సజ్జలను అని.. సానుభూతి కోసం జగన్ తననే అన్నారని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఓట్లు, సీట్లు వస్తాయని గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు కూడా పట్టాభి తిట్టిన బోసిడీకే […]
హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో […]
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఔదార్యం చూపించారు. మెగా అభిమానుల క్షేమం కోసం పరితపించే ఆయన.. తాజాగా ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖకు చెందిన వెంకట్ అనే మెగా అభిమాని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సదరు అభిమాని తనను కలవొచ్చని తెలిపారు. అయితే అభిమాని వెంకట్ […]
కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంకనగర్‌లో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్‌కు చెందిన గోవింద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: ఇలానే కొనసాగితే… వాటికి ముప్పు […]