తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులను పునరుజ్జీవింపజేయాలని కేసీఆర్ అన్నారు
Read Also: అచ్చెదిన్: ఏడాదిలో రూ.306 పెరిగిన సిలిండర్
తెలంగాణలో అడవిపై ఆధారపడ్డ గిరిజనులకు మేలు చేయాలని కేసీఆర్ తెలిపారు. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని సీఎం అన్నారు. అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల సంరక్షణలో గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాల్లో అటవీభూముల రక్షణపై అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.