మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పోరులో భారత్ గెలవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేకపూజలు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో కొందరు అభిమానులు ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అంతేకాకుండా భారత టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు కూడా పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టుపై భారత్ ఓడిపోలేదని.. ఈ మ్యాచ్‌లోనూ అదే రికార్డు కొనసాగించాలని ఆకాంక్షించారు.
Read Also: ఆ క్రికెటర్ నాకు స్ఫూర్తి: రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు కర్ణాటకలోని కలబురిగిలో కూడా భారత క్రికెట్ అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేశారు. భారత క్రికెట్ జట్టు ఫ్లెక్సీలతో ర్యాలీలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. ఈ మ్యాచ్‌పై దేశమంతటా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇప్పటికే పలు బార్లు, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించాయి. కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌లలో భారత్ విజయఢంకా మోగించింది.
Cricket fans from Punjab's Ludhiana (pic 1 & 3) to Karnataka's Kalaburagi (pic 2 & 4) pray for Team India's win against Pakistan in ICC T20 World cup match at Dubai#INDvPAK pic.twitter.com/HQPbk3SBRw
— ANI (@ANI) October 24, 2021