హర్యానా ప్రభుత్వం శనివారం నాడు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు సాధారణమే అయినా తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన బదిలీ కావడం తన 29 ఏళ్ల సర్వీసులో ఇది 54వ సారి కావడం విశేషం. ఆయన పేరు అశోక్ ఖేంకా. ఆయన హర్యానా ప్రభుత్వ ఆర్కివ్స్, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్టుమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు.
Read Also: పిల్లలకు హోంవర్క్ తగ్గించేలా కొత్త చట్టం
కోల్‌కతాకు చెందిన అశోక్ ఖేంకా 1991 బ్యాచ్ హర్యానా కేడర్ నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శనివారం నాడు అశోక్ ఖేంకాను సైన్స్, టెక్నాలజీ అండ్ ఫిషరీస్ డిపార్టుమెంట్ సెక్రటరీగా హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. అశోక్ నిజాయతీ వల్లే ఆయన తన కెరీర్‌లో అనేకసార్లు బదిలీ అయ్యారని సన్నిహితులు చెప్తున్నారు. కాగా అశోక్ లాంటి అధికారి అన్ని డిపార్టుమెంట్‌ల్లో ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.