దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచి కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మరోసారి బీజేపీనే అధికారం చేపట్టనుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి సీట్లు తక్కువగా వస్తాయని సర్వే వెల్లడించింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 2017 ఎన్నికల్లో బీజేపీ 325 […]
నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతిని పురస్కరించుకుని నేడు తెలంగాణ ఇంజినీర్స్ డేను నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కానున్నారు. Read Also: ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన రికార్డు తొలుత జలసౌధలో విశ్రాంత ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్‌రావు విగ్రహానికి […]
టీ20 ప్రపంచకప్ 2021 ఆఖరి ఘట్టానికి చేరింది. నేడు జరిగే టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. కాబట్టి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమాలో పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిన విషయమే. ఈ సినిమాలోని కొన్ని పాటలు యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాటకు మిలియన్స్ వ్యూస్ వచ్చి చేరాయి. తాజాగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ 700 మిలియన్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డు […]
భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి […]
ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, వారి మధ్య ప్రేమ విఫలమైనప్పుడు, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోయినప్పుడు లవ్‌లో బ్రేకప్ వస్తుంది. అయితే చాలా మందికి బ్రేకప్ నుంచి బయటపడటం అనేది నరకంగా ఉంటుంది. ఒక్కోసారి బ్రేకప్ అయిన వ్యక్తికి ఇంకా రిలేషన్ కొనసాగించాలని కొందరు భావిస్తారు. ఇంకా వారితో స్నేహంగా ఉండాలని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఆ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ వదిలేసి బయటకు రావాలి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే […]
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. దీంతో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇదే అంశంపై చర్చించేందుకు డీకే అరుణ నివాసంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల […]
మెగా హీరోలంటే నిర్మాత బండ్ల గణేష్‌కు… బండ్ల గణేష్ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మెగా అభిమానుల కోసమే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయితే శనివారం రోజు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ బండ్ల గణేష్‌ను కదిలించింది. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది?కవిరాజ్ అనే వ్యక్తి తన అక్క […]
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ టీటీడీకి సర్టిఫికెట్ అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ ప్రతినిధులు స్వయంగా అందజేశారు. Read Also: తిరుపతి కౌన్సిల్ సమావేశంతో ఒరిగేదేంటి? ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో […]
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన ఎనకౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్‌లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టులు చనిపోయిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. కాగా గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. […]