నాలుగు రాష్ట్రాలలో మళ్లీ బీజేపీదే అధికారం… స్పష్టం చేసిన సర్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచి కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మరోసారి బీజేపీనే అధికారం చేపట్టనుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి సీట్లు తక్కువగా వస్తాయని సర్వే వెల్లడించింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 2017 ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీకి 217 స్థానాలు మాత్రమే వస్తాయని.. తద్వారా తక్కువ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వే ద్వారా వెల్లడైంది. ఈ దఫా సమాజ్‌వాదీ పార్టీ 150 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
Read Also: టీ20 ప్రపంచకప్: కౌన్ బనేగా న్యూ ఛాంపియన్?
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
మరోవైపు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా నిలవనున్నట్లు వెల్లడైంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ ఓటర్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 31, అకాలీదళ్ 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. గోవాలోనూ మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడించింది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ 21 చోట్ల విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ అధికారం నల్లేరుపై నడకేనని తేలింది. కానీ గతంలో వచ్చినంత మెజారిటీ రాదని వెల్లడైంది. 70 స్థానాలు ఉన్న ఉత్తరాంఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ 38 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. మణిపూర్‌లో మరోసారి బీజేపీ పాగా వేయనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ 27 చోట్ల విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 22 చోట్ల గెలుస్తుందని సర్వేలో తేలింది.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!