మీరు బ్రేకప్ నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, వారి మధ్య ప్రేమ విఫలమైనప్పుడు, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోయినప్పుడు లవ్‌లో బ్రేకప్ వస్తుంది. అయితే చాలా మందికి బ్రేకప్ నుంచి బయటపడటం అనేది నరకంగా ఉంటుంది. ఒక్కోసారి బ్రేకప్ అయిన వ్యక్తికి ఇంకా రిలేషన్ కొనసాగించాలని కొందరు భావిస్తారు. ఇంకా వారితో స్నేహంగా ఉండాలని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఆ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ వదిలేసి బయటకు రావాలి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే బ్రేకప్ నుంచి బయటపడేందుకు కొన్ని ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
1) మీపై మీరు శ్రద్ధ పెట్టండి: రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ అయిన తర్వాత మీతో మీరు కనెక్ట్ కావాలి. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకుంటే మరో వ్యక్తితో రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో గుర్తిస్తారు. విచారంతో మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేస్తే మీరు అందవికారంగా తయారవుతారు. అందువల్ల మీ అందంపై దృష్టి సారించాలి. అనంతరం మీకు ఎలాంటి వ్యక్తి భాగస్వామిగా కావాలి, వారితో ఎలాంటి రిలేషన్ షిప్ ఉండాలో తెలుసుకోండి. మీ బలాలు, బలహీనతలను గుర్తించండి. మీ గురించి మీకు బాగా తెలిసినప్పుడు మీకు ఎలాంటి వ్యక్తి కావాలో తెలుస్తుంది. ఒంటరితనం వల్ల ఎవరితో ఒకరితో రిలేషన్ షిప్‌లో ఉండాలనే భావనలోకి వెళ్లకండి. అలా చేస్తే మళ్ళీ అవే తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రిలేషన్ షిప్ నుంచి కాస్త విరామం తీసుకుని మీతో మీరు ఎక్కువ సమయం గడపండి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
Read Also: మగాళ్లు.. మీరు ఆ పని చేయండి.. అందులో తప్పేంలేదు
2) మీ కుటుంబంతో గడపండి: బ్రేకప్ తర్వాత ఎక్కువగా ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. ఆ ఒంటరితనంలో ఒక్కోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా కుటుంబసభ్యులతో హాయిగా గడపండి. కుటుంబీకులతో సరదాగా ఉండేలా జోక్స్, కామెడీ వీడియోలు చూడండి. వారితో మీ బాధను చెప్పుకోండి. వారితో మీ బాధలను చెప్పుకోవడం వల్ల మీకు రిలీఫ్‌గా ఉంటుంది. వీలైతే వారి సలహాలను స్వీకరించండి. మీకు మంచిగా అనిపిస్తే ఆ సలహాలను ఆచరణలోకి పెట్టి చూడండి. అప్పుడు మీ జీవితంలో మార్పులు చోటుచేసుకోవచ్చు.
3) అన్నింటికీ సరే అనడం: రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కంటే కూడా బ్రేకప్ తర్వాత ప్రవర్తన మారిపోతుంటుంది. ఆ సమయంలో మీరు అన్ని విషయాలకు అవును అనడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. పైగా మీరు వీలైనంత సర్దుకోవడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా ఇది మీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. అలానే మీరు అనుక్షణం బాధ పడకుండా ఉండడానికి చూస్తూ ఉండండి. ఎందుకంటే గతాన్ని అలా తలచుకుంటూ ఉంటే ఏమీ రాదు. బంగారు భవిష్యత్తును అలా వదిలేయడం మంచిది కాదు.
4) సోషల్ మీడియా జోలికి వెళ్లకండి: కొన్ని సార్లు సోషల్ మీడియా వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. అలానే మీరు బ్రేకప్ అయిన వారి విషయాలు మీకు తెలియకుండా ఉండడానికి మీరు వాళ్ళను బ్లాక్ చేయండి. వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ నుంచి కూడా దూరంగా ఉండండి. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీకు వాళ్ళ విషయాలు తెలుస్తాయి. ఇది నిజంగా మీ గుండెను గుచ్చుతుంది. కాబట్టి వీలైనంత దూరంగా సోషల్ మీడియాకు ఉండండి. అలాగే మీరు ఎవరితో అయినా చాటింగ్ చేసేటప్పుడు బ్రోకెన్ హార్ట్స్ పెట్టడం వంటివి చేయకండి దీని వల్ల మీరు ఇతరుల ముందు చులకన అయిపోతారు. పైగా అందరూ కూడా మీకు వాళ్ళని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. అయినా అన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మంచిది కాదు.
5) కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి: బ్రేకప్ సమయంలో ఒంటరిగా ఉంటే మనకు ఏమీ తోచదు. అందువల్ల కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీరు జీవితంలో ఎలాంటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు? మీ కెరీర్ ఎలా సాగాలని మీరు కోరుకుంటున్నారు? మీ శరీరం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ఇలాంటి విషయాల గురించి కొంచెం సమయం తీసుకుని ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించడానికి ఏం చేయాలో ఆలోచించండి.
- Tags
- Boys
- break up
- girls
- lovers
- relation ship
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి