జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ షో ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రూ.కోటి ఎవరూ గెలుచుకోలేదు. అయితే తొలిసారిగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రూ.కోటి గెలుచుకున్న ఘనత సాధించినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను […]
మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు 40 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారి సంఖ్య కూడా 47 శాతానికి చేరింది. ముఖ్యంగా 15-25 ఏళ్ల మధ్య వయసు వారు నెట్ ఎక్కువగా వాడుతున్నారని సర్వే తెలిపింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 2019లో 19 శాతం మాత్రమే ఉండగా… 2021 నాటికి […]
సైబర్ నేరాలపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. ఎంత హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం మారడం లేదు. నిత్యం సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. దీంతో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీ పేరుతో నేరగాళ్లు రూ.33 లక్షలను దోచుకున్నారు. Read Also: దుమారం రేపుతున్న హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్‌కు చెందిన […]
ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఒంటరి జీవితం అనుభవిస్తూ బాధపడుతోంది. మినత్ పట్నాయక్ (63) అనే మహిళ భర్త 2020లో అనారోగ్యంతో మృతిచెందగా… ఓ అగ్నిప్రమాదంలో కుమార్తె కూడా ఇటీవల ప్రాణాలను విడిచింది. దీంతో వృద్ధురాలు ఒంటరిగా మారింది. అప్పటివరకు పట్టించుకోని అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెపై కపట ప్రేమను చూపించడానికి ప్రయత్నించారు. ఈ విషయం కనిపెట్టిన వృద్ధురాలు సంచలన నిర్ణయం తీసుకుంది. Read Also: బాలల దినోత్సవం ప్రత్యేకత ఏంటి? తన దగ్గర […]
గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందనే కారణంగా 14 ఏళ్ల బాలికను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండు కొట్టించి ముఖానికి నల్లరంగు పూశారు. బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఇదే విధంగా శిక్షించి ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. అనంతరం బాలికకు అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తితో వివాహం చేసినట్లు వెల్లడించారు. Read […]
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఏడాది నెహ్రూ 132వ జయంతి. నెహ్రూకు పిల్లలన్నా.. రోజా పూలన్నా చాలా ఇష్టం. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలిపేందుకు… నెహ్రూ జయంతి రోజు బాలల దినోత్సవం జరుపుకుంటారు. 1964 మే 27న నెహ్రూ మరణించడంతో ఆయన పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరపాలని తీర్మానించగా… అప్పటి నుంచి నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ […]
హైదరాబాద్ దోమలగూడలో నవ వధువు భార్గవి మిస్సింగ్ మిస్టరీ వీడింది. భార్గవి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. దోమలగూడకు చెందిన భార్గవి ఈనెల 10న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబసభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. 200 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. Read Also: […]
గడిచిన 580 ఏళ్లలో ఆకాశంలో ఎన్నడూ చోటుచేసుకోని అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈనెల 19న సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఆకాశంలో దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ దేబిప్రసాద్ దురై శనివారం వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 19న మధ్యాహ్నం 12:48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. మొత్తం 3 గంటల 28 నిమిషాల […]
నాగార్జునసాగర్- శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. బోట్ తిరిగే ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో వాటికి టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లించాలని టూరిజం శాఖను అటవీ శాఖ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బోట్ సర్వీసులు నిలివేశారు. కాగా ఈ బోట్ దాదాపు అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ప్రయాణిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ ప్యాకేజీని అధికారులు […]
విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. Read Also: నాలుగు రాష్ట్రాలలో […]