కన్నడ సినీ పరిశ్రమలో కరుణాడ చక్రవర్తిగా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న నటుడు శివ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ’45 ది మూవీ’. ఈ చిత్రంలో ఆయనతో పాటు రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్స్ కలిసి నటించడంతో, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటి వరకు ’45 ది మూవీ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా, సినిమా యొక్క కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ విజువల్ వండర్ జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ’45 ది మూవీ’ ట్రైలర్ వీక్షకులను ఒక కొత్త యాక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ అన్నీ అత్యంత వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. కొత్త రకమైన ఆయుధాలు, బాణాలతో చేసే దాడులు, బుల్లెట్ల వర్షం, ప్రత్యేకంగా డిజైన్ చేసిన ద్విచక్ర వాహనం వంటి అంశాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి.
Also Read:Ravi Teja – Vashishta: వశిష్ట దర్శకత్వంలో మాస్ మహారాజా కొత్త సినిమా
ఒకవైపు పీరియడ్ తరహా యుద్ధ సన్నివేశాలు, విభిన్నమైన బ్యాక్‌డ్రాప్ కనిపిస్తూనే, మరోవైపు ప్రస్తుత ట్రెండ్‌కు తగిన ఆధునిక యాక్షన్ సీన్లు కూడా చూపించారు. శివ రాజ్ కుమార్ కొత్త లుక్స్, అప్పియరెన్స్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా, ట్రైలర్‌లోని చివరి షాట్‌లో శివన్న గెటప్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఉపేంద్ర తనదైన యాక్షన్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. రాజ్ బి శెట్టి మరియు మొట్టా రాజేంద్రన్ కాంబినేషన్ అదిరిపోయేలా ఉంది. ఈ ట్రైలర్‌లోని విజువల్స్ మరియు రీ-రికార్డింగ్ (RR) నాణ్యత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:Champion: ఛాంపియన్ కోసం చిరుత
ఒక విజువల్ వండర్‌గా, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కూడిన ’45 ది మూవీ’ జనవరి 1న తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ, చేతన్ డిసౌజా వంటి ప్రముఖ ఫైట్ మాస్టర్లు పోరాట సన్నివేశాలను కంపోజ్ చేశారు. అనిల్ కుమార్ మాటలు అందించగా, సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేశారు. సాంకేతిక విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. జనవరి 1న విడుదల కానున్న ’45 ది మూవీ’ ప్రేక్షకులకు ఒక కొత్త యాక్షన్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.