టీ20 ప్రపంచకప్ 2021 ఆఖరి ఘట్టానికి చేరింది. నేడు జరిగే టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. కాబట్టి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు 2010లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై టైటిల్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. ఈసారి మాత్రం కప్పును ముద్దాడాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
Read Also: ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన రికార్డు
ఇరుజట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ను నమ్ముకోగా.. న్యూజిలాండ్ జట్టు మాత్రం బౌలింగ్‌పై నమ్మకంతో బరిలోకి దిగనుంది. ఆసీస్ జట్టులో వార్నర్, ఫించ్, స్టాయినీస్, మ్యాక్స్‌వెల్, వేడ్ కీలకం కానున్నారు. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ భారం ముఖ్యంగా గప్తిల్, మిచెల్, విలియమ్సన్, కాన్వేలపైనే ఉంది. ఆసీస్, కివీస్ చిరకాల ప్రత్యర్థులు కావడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలుస్తారు కాబట్టి విజయంపై ఇరు జట్లు ధీమాగా కనిపిస్తున్నాయి.