ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమాలో పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిన విషయమే. ఈ సినిమాలోని కొన్ని పాటలు యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాటకు మిలియన్స్ వ్యూస్ వచ్చి చేరాయి. తాజాగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ 700 మిలియన్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
Read Also: బాలయ్య ‘అన్ స్టాపబుల్’.. మూడో గెస్ట్ అతడే..?
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా, అత్యధిక లైకులు సాధించిన పాటగా ‘బుట్టబొమ్మ’ నిలిచింది. ఈ పాటకు ఇప్పటివరకు 4.4 మిలియన్ల లైక్‌లు వచ్చాయి. అల్లు అర్జున్ వేసిన డ్యాన్సులు ఈ పాటకు హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. బుట్టబొమ్మ పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా.. తమన్ సంగీతం అందించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.