నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
Also Read:Ravi Teja – Vashishta: వశిష్ట దర్శకత్వంలో మాస్ మహారాజా కొత్త సినిమా
అభిమానుల గురించే ఆలోచన!
సినిమా విడుదల ఒక వారం రోజులు ఆలస్యమైన నేపథ్యంలో, ఆ సమయంలో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, బాలకృష్ణ గారు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అనే ప్రశ్న బోయపాటిని మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి సమాధానంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ “నేను మనిషినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని అనివార్య కారణాలవల్ల అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. అయితే, మా ఆలోచన అంతా బాలకృష్ణ గారి అభిమానుల గురించే. రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ, ఒక రెండు గంటలకు ముందు టికెట్లు తీసుకుని, థియేటర్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఇలా వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది సహజం. ఆ క్షణం మా ఆలోచనలన్నీ అభిమానుల గురించే.”
Also Read:Shivaji: ‘దండోరా’లో నా పాత్ర మిస్టరీ.. ఇది పక్కా కమర్షియల్
“అయితే వచ్చిన పరిస్థితి గురించి మేము భయపడలేదు. మాకు బాలకృష్ణ గారు ఉన్నారనే ధైర్యం ఉంది. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేము. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత బాలయ్య గారు వచ్చి సినిమా విడుదలకి ఏం కావాలో అన్నీ చేశారు. ఆ తర్వాత అన్నీ కూడా సజావుగా జరిగిపోయాయి. సినిమా రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించింది” అని అన్నారు. బోయపాటి మాటలను బట్టి, వాయిదా వంటి ఒత్తిడి సమయంలో కూడా బాలకృష్ణ యూనిట్‌కు అండగా నిలబడటంతో సినిమా అనుకున్న విధంగా విజయాన్ని సాధించిందని స్పష్టమవుతోంది.