దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో శుక్రవారం నాడు మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పేకమేడలా కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57,107 వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.45లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఏకంగా 510 పాయింట్లు కోల్పోయి 17,026 వద్ద స్థిరపడింది. దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఒక్క భారత సూచీలే కాదు.. దాదాపు ఆసియా సూచీలన్నీ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్ షోతో బుల్లితెర అభిమానులను అలరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి అభిమానులను సంతోషపరుస్తున్నాడు. ఇప్పటికే ఈ షో కోసం పలువురు గెస్టులు హాజరై ఎన్టీఆర్‌తో మాటామంతీ కలిపారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, హీరోయిన్ సమంత… ఇలా సెలబ్రిటీలు ఎన్టీఆర్ షోకు హాజరయ్యారు. Read Also: […]
టాలీవుడ్‌లో భారీ సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 2న విడుదలయ్యే బాలయ్య ‘అఖండ’తో భారీ బడ్జెట్ సినిమాలకు తెర లేవనుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖండ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. గతంలో బాలయ్య-బోయపాటి […]
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఓపెనర్లు ఇస్లాం (14), సైఫ్ హసన్ (14) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం శాంతో (14), కెప్టెన్ మోనిముల్ హక్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో 49 పరుగులకే బంగ్లాదేశ్ […]
తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్‌తో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మిస్తే రైతు బంధు కట్ చేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు ధరణి పోర్టల్ వచ్చాక లక్షల ఎకరాల్లో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. Read Also: […]
దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ […]
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఇటీవల సభలో చంద్రబాబు మైక్ కట్ చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు టీడీపీ సభ్యులు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీ స్పీకర్ సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించినట్లు […]
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది. Read Also: […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో తాను మాట్లాడినట్లు తెలిపాడు. ఆయన రెండో కుమారుడు అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. Read Also: గ్రీన్ ఇండియా […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఆరు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో ఒక్కో స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. Read Also: మహిళతో రాసలీలలు… అడ్డంగా దొరికిపోయిన వనపర్తి ఎస్సై రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు… మహబూబ్‌నగర్ జిల్లా […]