టాలీవుడ్‌లో భారీ సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 2న విడుదలయ్యే బాలయ్య ‘అఖండ’తో భారీ బడ్జెట్ సినిమాలకు తెర లేవనుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖండ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. గతంలో బాలయ్య-బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్లు రావడంతో అఖండపై అంచనాలు నెలకొన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
Read Also: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా.. హీరోయిన్ డ్రెస్ పై నెటిజన్స్ కామెంట్స్
ఏపీలోని ఉత్తరాంధ్ర, సీడెడ్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలలోనే కాకుండా నైజాంలోనూ గతంలో ఎన్నడూ బాలయ్య సినిమాలకు లేని విధంగా బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాల్లోనూ అఖండకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్‌లో తొలిసారిగా ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది. మరోవైపు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలుపుకుంటే అఖండ బ్రహ్మాండమైన స్థాయిలో నిర్మాతకు వసూళ్లు తెచ్చిపెట్టిందని సమాచారం. కాగా ఈనెల 27న హైదరాబాద్ శిల్పకళావేదికలో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే.