పాకిస్థాన్‌తో తొలి టెస్టు.. భారీ స్కోరుపై కన్నేసిన బంగ్లాదేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఓపెనర్లు ఇస్లాం (14), సైఫ్ హసన్ (14) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం శాంతో (14), కెప్టెన్ మోనిముల్ హక్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో 49 పరుగులకే బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read Also: కాన్పూర్ టెస్టులో పుంజుకున్న న్యూజిలాండ్
Also Read
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
అయితే ఆ తర్వాత వచ్చిన ముష్ఫీకర్ రహీమ్ (82), లిట్టన్ దాస్ (113) పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా వీళ్లిద్దరూ ఎడాపెడా బౌండరీలతో స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. రహీమ్, దాస్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లాదేశ్ కోలుకుంది. లిట్టన్ దాస్‌కు టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, అష్రాఫ్, సాజిద్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.
కాగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆరంభానికి ముందు ఛటోగ్రామ్‌లో భూకంపం రావడంతో ఇరుజట్ల క్రికెటర్లు భయాందోళనలకు గురయ్యారు. దాంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనుమానం కలిగింది. అయితే భూకంప తీవ్రత మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. నిర్ణీత సమయానికే తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!