యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్ షోతో బుల్లితెర అభిమానులను అలరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి అభిమానులను సంతోషపరుస్తున్నాడు. ఇప్పటికే ఈ షో కోసం పలువురు గెస్టులు హాజరై ఎన్టీఆర్‌తో మాటామంతీ కలిపారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, హీరోయిన్ సమంత… ఇలా సెలబ్రిటీలు ఎన్టీఆర్ షోకు హాజరయ్యారు.
Read Also: భారీ స్థాయిలో అఖండ ప్రి రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్‌లో ఇదే తొలిసారి
అయితే త్వరలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలను జెమినీ టీవీ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా కొద్దిరోజుల్లో టీవీలో ప్రసారం కానుంది. ఈ షోలో మహేష్ రూ.25 లక్షలు గెలుచుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మొత్తాన్ని మహేష్ ఛారిటీ కోసం కేటాయించి మంచి మనసు చాటుకున్నాడట. ఈ షోలో సెలబ్రిటీలు ఎవరు పాల్గొన్నా… వారు గెలుచుకున్న మొత్తాన్ని ఛారిటీకే ఇవ్వాలని షో నిర్వాహకులు రూల్ పెట్టిన సంగతి తెలిసిందే.