తెలుగు రాష్ట్రాల రైతులకు కల్పతెరువుగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించి నేటితో 66 ఏళ్లు పూర్తవుతోంది. 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ డ్యాం నిర్మాణం 1970లో పూర్తయింది. కృష్ణానదిలపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతిపెద్దది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమశక్తి ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలామంది కార్మికులు అసువులు కూడా బాశారు. ప్రపంచంలో […]
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘బడుల బాగు’ పథకం త్వరలోనే పట్టాలెక్కనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రూ.2000 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4000 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు […]
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండటంతో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలపై అధికారులు నిషేధం విధించారు. అయితే డిసెంబర్ 1 తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలో ఏపీకి 12,500 మంది విదేశీయులు రావడంతో ప్రజల్లో ఒమిక్రాన్ వైరస్ భయాందోళనలు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా విశాఖ జిల్లా వారే ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. Read Also: కరోనా అంతంపై […]
అయ్యప్ప స్వాముల మాలధారణల నేపథ్యంలో శబరిమల వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొల్లం వరకు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 19-22 తేదీల మధ్య కాచిగూడ-కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 17న సికింద్రాబాద్-కొల్లం మధ్య, 19న కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141 […]
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం కన్నులపండుగగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు […]
తిరుపతిలో కొందరు దుండగులు ఏటీఎంల ట్యాంపరింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో ట్యాంపరింగ్ చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని ఈనెల 2న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల […]
యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఉదయం సెషన్‌లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 152 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ వార్నర్ 94, లబుషేన్ 74, స్టార్క్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. లీచ్, రూట్ […]
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను […]
రైల్వేశాఖలో భారీగా పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-డిలో పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 23న పున:ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 9,328 పోస్టులకు ఈనెల 23 నుంచి దశలవారీగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోస్టులలో ట్రాక్‌మన్ విభాగంలో 4,753, పాయింట్స్‌మెన్‌లు 1,949, హాస్పిటల్ అటెండర్లు 37, మిగతా పోస్టుల ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. Read Also: వాట్సాప్ ద్వారా క్రిప్టో […]
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read Also: ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ […]