✍ తెలంగాణలో నేడు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్✍ ఢిల్లీ: నేడు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు… నేడు ప్రజల సందర్శనార్థం రావత్ దంపతుల భౌతిక కాయాలు.. ఉ.11 గంటల నుంచి ప్రజలు, ప్రముఖుల సందర్శనకు అనుమతి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి భౌతికకాయాల సందర్శనకు సైనికాధికారులకు అనుమతి✍ ఏపీలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు… పీపీపీ విధానంలో విశాఖ, అనంతపురంలో ఏర్పాటు.. నేడు […]
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి సంగం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మంది వాగు ఉధృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వాగులో భారీ వరదలో పలువురు ప్రయాణికులు కొట్టుకుపోతుండగా.. ఏడుగురిని స్థానికులు […]
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ గాయపడ్డ […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది అభ్యర్థులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో […]
ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు […]
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్‌గా మారారని ఎద్దేవా చేశారు. వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి నాలుగు ఫోటోలు దిగి జంప్ అవుతున్నారంటూ లోకేష్ ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు, […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బస్సు ఎక్కి ప్రయాణం చేశారు. గురువారం నాడు హైదరాబాద్ నగరంలోని సిటీ ఆర్డినరీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణించారు. తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తున్న బస్ డే సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సజ్జనార్ బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేవారు వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సులో […]
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్‌లు జోరుగా నడుస్తున్నాయి. ఈ రోజు విడుదలైన ట్రైలర్ గురించి రివ్యూలు, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటన.. ఇలా పలు అంశాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా […]
తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. జనవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు సిఫారసులపై గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ప్రకటించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి వేడుకలు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆయా తేదీలలో తిరుమల వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే […]