దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది. ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రానికి […]
తమిళనాడులో రెండు రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. త్రివిధ దళాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుపుతోందని IAF వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో బయటకు వస్తాయని.. అప్పటివరకు ప్రమాదంపై ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు తప్పుడు ప్రచారం వద్దని.. ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను మనం కాపాడాల్సిన అవసరం ఉందని IAF పేర్కొంది. Read Also: డీఎన్‌ఏ […]
హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో బస్తీ దవాఖానాను శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి హరీశ్‌రావు సనత్‌నగర్ పరిధిలో ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా […]
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2017లో విడుదలైన బాహుబలి-2 ట్రైలర్ ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో టాప్‌లో కొనసాగుతుండటం విశేషం. తాజాగా విడుదలైన రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ కూడా బాహుబలి-2 రికార్డును టచ్ చేయలేకపోయింది. Read Also: రివ్యూ: లక్ష్య బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కించుకుని దక్షిణాది చిత్రాల్లోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. […]
విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్‌గా గుజరాత్‌లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్‌లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు […]
దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి […]
జీవితంలో సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడే త్వరపడండి. లేకపోతే మీరు ఇల్లు కొనుగోలు చేయడం కష్టతరం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనా పరిణామాల వల్ల గత రెండేళ్లుగా నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. వచ్చే ఏడాది మాత్రం 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు 2022 అవుట్ లుక్ […]
మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన కార్యాలయంలో లక్ష్మీనారాయణ పనిచేశారు. తన పదవీ విరమణ తర్వాత.. చంద్రబాబు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. […]
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. ఢిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిపిన్ రావత్ సహా ఘటనలో మృతి చెందిన 13 మందికి దేశమంతా నివాళులు అర్పిస్తోంది. బిపిన్ రావత్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విమానయాన శాఖ […]