టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల వివాహమై నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భావోద్వేగంతో ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాలుగేళ్లుగా నేను వేసిన సిల్లీ జోకులను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావు. నాలుగేళ్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. గత నాలుగేళ్లలో నాలో […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన విధులతో ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. ఒక్కోసారి మీట్ విత్ కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్‌లతో చిట్‌చాట్ కూడా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా మంత్రి కేటీఆర్ నెటిజన్‌లతో పంచుకుంటారు. Read Also: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100 మంది మృతి తాజాగా మంత్రి కేటీఆర్ తాను 2001లో లండన్‌లో ఉన్నప్పటి […]
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుడిగాలుల తరహాలో విరుచుకుపడే టోర్నడోల కారణంగా కెంటకీ అనే ప్రాంతంలో ఇప్పటికే 100మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషిర్ వెల్లడించారు. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత బీభత్సమైన టోర్నడో అని గవర్నర్ తెలిపారు. ఒక్క మేఫీల్డ్ నగరంలోనే కొవ్వత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. Read Also: పాముతో పరాచకాలాడితే ఇలాగే […]
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి […]
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండల తహసీల్దార్ దయాకర్ రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత నాలుగు నెలలుగా ప్రతిరోజూ రాత్రిపూట ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో బాధిత మహిళ ఈనెల 8న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. Read Also: జగన్ పాలన అద్భుతం.. మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది: నటుడు అలీ తహసీల్దార్ దయాకర్‌రెడ్డి నిజంగానే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని […]
ఏపీలో వైసీపీ పాలనపై నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. ఏపీలో అన్ని వర్గాలకు సీఎం జగన్ సమన్యాయం చేస్తున్నారని అలీ కొనియాడారు. టాలీవుడ్‌కు సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్ల విధానం, బెనిఫిట్ షోల వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అలీ పేర్కొన్నారు. దీనిపై జగన్ సానుకూలంగానే ఉన్నారని భావిస్తున్నట్లు అలీ తెలిపారు. Read Also: ఏపీలో […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. తాజాగా అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ఈరోజు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బాబు.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా […]
తిరుమల తిరుపతి దేవస్థానం అగర్‌బత్తీలు తయారుచేయడంపై ఏపీ సాధుపరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు ధార్మిక సంస్థా? లేక వ్యాపార సంస్థా? అని ఏపీ సాధుపరిషత్ ప్రశ్నించింది. శ్రీవారి పూజ అనంతరం నిర్మల్యాలను అగర్‌బత్తీలా మారుస్తామంటే అర్థం ఏంటని మండిపడింది. స్వామి వారి పూజకు వినియోగించిన పూలు పర్యావరణానికి హాని ఎలా అవుతాయో టీటీడీ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. హిందూ వ్యతిరేక చర్యలను టీటీడీ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికింది. స్వామివారికి అలంకారం […]
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు శనివారం అర్ధరాత్రి కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్‌బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4:30 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. Read […]
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 5 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడు పెనాల్టీ పాయింట్లు కోల్పోయిన జట్టు కేవలం 9 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ […]