రైల్వేశాఖలో భారీగా పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-డిలో పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 23న పున:ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 9,328 పోస్టులకు ఈనెల 23 నుంచి దశలవారీగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోస్టులలో ట్రాక్‌మన్ విభాగంలో 4,753, పాయింట్స్‌మెన్‌లు 1,949, హాస్పిటల్ అటెండర్లు 37, మిగతా పోస్టుల ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి.
Read Also: వాట్సాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ
దేశవ్యాప్తంగా అన్ని జోన్‌లకు సంబంధించి 1,03,769 పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయాలని నిర్ణయించగా రెండేళ్ల క్రితమే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కరోనా కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమైందని రైల్వేశాఖ వెల్లడించింది. ఆయా పోస్టులకు దాఖలైన వాటిలో ఫోటో, సంతకం సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో 4,85,607 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకుని.. ఫోటో, సంతకాలను తిరిగి అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని.. ఆ లింక్ డిసెంబర్ 15న విడుదల చేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది.