తిరుపతిలో కొందరు దుండగులు ఏటీఎంల ట్యాంపరింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో ట్యాంపరింగ్ చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని ఈనెల 2న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు.
Read Also: నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల భర్తీ ప్రక్రియ
బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు తాము కేసు దర్యాప్తు ప్రారంభించి బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామని అర్బన్ ఎస్పీ వెల్లడించారు. నిందితులు హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లా పిప్రోలి గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్ (25), సలీంఖాన్ (25)గా గుర్తించామని తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన ఆరు కేసుల్లో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరికి సహకరించిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.