హైదరాబాద్‌లో దారుణం.. భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను ఫర్వేజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
Read Also: వ్యవసాయ రంగంలో పెరిగిన కార్మికుల సంఖ్య
Also Read
అయినా ఫర్వేజ్‌లో మార్పు రాలేదు. భార్యపై ఇంకా అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి ఫుల్లుగా గంజాయి సేవించి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ నిద్రిస్తుండగా కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతోనే అతడు దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతురాలు సమ్రీన్ బేగంకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతురాలి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!